STOP THE SALES OF SAND IMMEDIATLY IN SWARNAMUKHI RIVER

Signatures:
  315 (Goal: 10,000)

Petitioning: PRESIDENT OF INDIA,PM OF INDIA,CENTRAL ENVIRONMENT MIN,GOVAP,COLLECTOR NELLORE,

Petitioner: ANREDDY started on February 5, 2015

Date : 05-02-2015
BALIREDDY PALEM
మహా రాజ రాజశ్రీ గౌరవనీయులైన --------వారి దివ్య సముఖమునకు శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాళెం గ్రామ కాపురస్తుడు వేగూరు అమర్నాథ్ రెడ్డి స్వర్ణముఖి నదీగర్భంలో ఇసుక తరలింపు పై వ్రాసుకున్న మనవి అర్జి
నదీ నేపద్యం : - చిత్తూరుజిల్లాలో పుట్టి నెల్లూరుజిల్లాలో సాగర సంగమం చేస్తున్న పవిత్ర స్వర్ణముఖి నది చారిత్రకనేపథ్యం కలిగి ఉన్న పురాతన నది. అట్టి నదీగర్భమే ఆలంబనగా నదికి ఇరువైపులా కొన్ని వేల మంది రైతులు,రైతు కూలీలు అత్తెసరు ఆదాయాలతో భారంగా తమ బ్రతుకు బండిని ఈడుస్తున్నారు. ప్రధానంగా స్వర్ణముఖి నదీగర్భం లోతు తక్కువ కలిగి ఉంటుంది అది కూడా సముద్ర తీరానికి దగ్గరయ్యే కొద్దీ మరీ 3 నుంచి 10 అడుగులలోపు మాత్రమే ఉంది.తీరప్రాంత గ్రామాలకు స్వర్ణముఖి నది ఒక వరం సముద్రపు ఉప్పు నీటిని పై పొరలలోని కి చొచ్చుకు రానీకుండా అడ్డుపడుతూ నదికి ఇరువైపులా 10 నుంచి 15 కిలోమీటర్ల వ్యాసార్ధంలో భూగర్భజలాలకు మరియు ఉప్పునీటి నిరోధానికి ప్రధాన ఆధారం స్వర్ణముఖి నదేననటం నిర్వివాదాంశం. ఈ నదీ తీరంలో నివసిస్తున్న ప్రజలకు అంతో ఇంతో వ్యవసాయ భూమి ఉన్నందున ఉన్నత చదువులు చదివిన వారు కూడా వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవిస్తున్నారు. ఒకప్పుడు సంవత్సరంలో 7-8నెలలు ప్రవహించే నది ఇప్పుడు ఈ మారుతున్న వాతావరణ పరిస్థితులలో 7 రోజులు ప్రవహించటం కూడా కష్టంగా ఉన్నది. నదికి ఇరువైపులా ఎల్లప్పుడూ పచ్చటి పంటలతో కళ కళలాడిన నదీ తీరం ఇప్పుడు సంవత్సరం లో ఒక పంటకే పరిమితమై పోయింది. తనపై ఆధారపడిన తన బిడ్డలకు ప్రాణావసరమైన త్రాగునీటిని కూడా అందించలేని నిస్సహాయ స్థితికి చేరుకుందన్నది నిష్టురసత్యం.
విషయం : - రాజ్యాంగం కల్పించిన స్వచ్చమైన తాగునీటి హక్కును ఎగతాళి చేస్తూ, పర్యావరణాన్ని పరిహసిస్తూ, కొన్ని వందల మంది బడుగు రైతుల వ్యవసాయ అవసరాలను ప్రమాదంలో పడేస్తూ, కొన్ని వేలమంది ప్రజల ప్రాణాధారమైన జీవజలానికి ఆశ్రయమిచ్చే (మారుతున్న వాతావరణ పరిస్థితులతో బక్క చిక్కిన) పవిత్ర స్వర్ణముఖి నది యొక్క గర్భాశయాన్ని తొలచి వేస్తున్న, ప్రస్తుత ప్రభుత్వ అధికారుల మరియు ప్రభుత్వ పెద్దల (అధికారిక స్మగ్లర్ల) ధన దాహపు, నియంతృత్వపు పోకడలతో బెదిరి స్థబ్దుగా ఉండి పోయిన అగ్రకుల పెద్దలతో ఇక లాభంలేదని తెలిసి "ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం మరచి నిదుర పోకుమా" అన్న మహాకవి శ్రీశ్రీ మాటలే స్పూర్తిగా తిరగబడ్డ బడుగు బలహీన వర్గాలకు చెందిన భూమాత ముద్దుబిడ్డలు(వ్యవసాయమే,వ్యవసాయ పనులే ప్రధాన జీవనోపాదిగా జీవిస్తున్న శ్రమజీవుల) తిరుగు బాటు గురించి.
బహిరంగ రహస్యం : - మండలంలోని అధికారులు, మాగ్రామంలోని పొదుపు మహిళలు,సెక్యూరిటీ, పోలీసు వారితో కుమ్మక్కు అయ్యి ఒక్క ట్రిప్పుకి DD తీసుకొని దానిపై 5-6 ట్రిప్పుల ఇసుకను ప్రక్క గ్రామంలోకి తోలి అక్కడి నుండి లారీలద్వారా సిలికా పర్మిట్లతో తమిళనాడుకు సరఫరా చేస్తుంన్నారన్నది బహిరంగ రహస్యం.
హాస్యాస్పదం : - జల సంరక్షణ, చెక్డామ్ల నిర్మాణం, నీరు మీరు, ఇంకుడు గుంటలు, పాత బావులు, కుంటల పునరుద్దరణ అంటూ విపరీతమైన ప్రచారంచేసి ప్రజల మదిలో చెరగని ముద్రవేసిన, ఆంధ్రా అన్నాహజారే అని ప్రజలచే ముద్దుగా పిలిపించుకున్న,రాతి ఇసుకను ప్రోత్సహిస్తారనుకున్న, మన గౌరవ ముఖ్యమంత్రివర్యులు వయసు తెచ్చిన ప్రభావమో ఏమో ఇప్పుడు ఇలా ఇసుక అమ్మకాలకు దిగజారటం నిజంగా హాస్యాస్పదం.
అధికార నిరంకుశం : తన గ్రామ ప్రజల సంక్షేమంకోసం గ్రామప్రజల ఒత్తిడితో, కేవలం 200 మీటర్ల పరిథిలో 4రీచ్లు దారుణమని, దయచేసి తమగ్రామ పరిధిలో ఇసుక అమ్మకాలను తక్షణమే నిలిపివేయించండి అని విన్నవించుకున్న మా గ్రామ ప్రజల ప్రతినిదులు అయిన గ్రామ సర్పంచి మరియు MPTC మెంబర్లను, అదే గ్రామ ప్రజల సాక్షిగా మీ పరధి దాటి ప్రవర్తించవద్దు అన్న మండల తహసిల్దారు వారి నియంతృత్వపు హెచ్చరిక, అడ్డువచ్చిన ప్రజలను తొక్కించి అయినా ఇసుక తోలాల్సిందేనన్న సదరు తహసిల్దారు వారి మాటలు,మాకు సాగు,తాగునీటి సమస్య వస్తుందని ఇసుక ఎత్తటానికి పర్యావరణ అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించిన ఒక రైతుపై s.c. , s.t. కేసు పెట్టి లోపలేయిస్తానన్న తహసిల్దారు వారి బెదిరింపులు, ఇసుక తవ్వకంవలన మా బోరుబావులలో నీరు అడుగంటి పోతుందని ఆవేదన వెలిబుచ్చిన ఒక రైతు బోరు బావినే పెరికించి వేస్తానన్న R.D.O. గారి హెచ్చరిక, దయచేసి తమగ్రామ పరిధిలో ఇసుక అమ్మకాలను నిలిపివేయించండి,పర్యావరణ సమతుల్యతను కాపాడండి అని విన్నవించుకున్న గ్రామ ప్రజల ప్రతినిదులు అయిన గ్రామ సర్పంచి మరియు MPTC మెంబర్లతో నీటి సమస్య వస్తే ట్యాంకర్లతోనైనా నీటిని తోలుతాము గానీ ఇసుక అమ్మకాలను ఆపేదిలేదని అత్యంత నిర్లక్ష్యంగా, నిరంకుశంగా సదరు ప్రతినిదుల మాటకూడా వినిపించుకోని GUDUR R.D.O. గారి ధోరణి దేనికి నిదర్శనం. ఇదేనా మహిళా ప్రజా ప్రతినిధులకు అధికారులకు ఇచ్చే గౌరవం.ఇలాంటి గౌరవాలతో ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యం చిన్నబోతోంది.
కోరుకుంటున్న తక్షణ పరిష్కారం : - తక్షణమే లోతు తక్కువ ఉన్న మాగ్రామంలో ఇసుక అమ్మకాలను అధికారికంగా నిలిపివేయటం, ఇప్పటి వరకూ జరిగిన ఇసుక అమ్మకాలపై తక్షణమే ఆడిట్ జరిపి అక్కడ జరిగిన అధికారిక అమ్మకాలు మరియు అక్రమాల లెక్క నిగ్గుతేల్చి అక్రమార్కులపై అత్యంత తీవ్రమైన చర్యలు తీసుకోవటం . మాగ్రామ పరిసరాలలో పర్యావరణాన్ని కాపాడటం.