ABOLISH contributory Pension Scheme (C.P.S.).this is a right of every employee

Signatures:
  32 (Goal: 5,000)

Petitioning: We want old pension system.pl.abolish C.P.S. immediately

Petitioner: Pidugu Pavan Kumar started on March 12, 2016

Respected prime minister & Respected chief ministers of india ఉద్యోగుల పాలిట గుదిబండ సిపిఎస్‌

ఉభయరాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యా యుల పరిస్థితి అడకత్తెరలో చిక్కిన పోకచెక్క సామెతలా మారింది. ఎప్పటికప్పుడు పాలకులు చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. సాధారణ ఎన్నికల వచ్చాయంటే రాజకీ యపార్టీలతోపాటు వీరికి కూడా ఉత్సాహం ఉరకలువేస్తుంటుంది. ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాలు తాము ప్రభుత్వ ఉద్యోగులమని, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వారికనుసన్నల్లో పనిచేయాల్సి ఉం టుందనే స్పృహ తాత్కాలికంగా కోల్పోతారు. పరోక్షంగా ఏదో ఒక పార్టీకి మద్దతు ప్రకటిస్తూ కుటుంబ సమేతంగా తమపార్టీయే అధి కారంలోకి రావాలని కాంక్షిస్తూఓట్లేస్తారు. తీరాపార్టీ పాలనా పగ్గాలు చేపట్టిన తరువాత అసలు కష్టాలు ప్రారంభం అవుతాయి. ఎందుకు ఈ పార్టీని అధికారంలోకి తెచ్చామా అని వాపోతుంటారు.
ఇది సహజం. కానిఇక్కడ వీరంతా ఒక విషయాన్నిగుర్తించాలి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఉద్యోగ వర్గాలకు ప్రత్యేకంగా ఒరిగేదే ముండదు. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి.పోతూఉంటాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఒక్కసారి వృత్తిలోకి ప్రవేశిస్తే చివరి వరకు అంటే పదవీవిరమణ వరకూ శాశ్వతంగా ఉంటారు. వారి విరమణ 60 సంవత్సరాల వయస్సు పూర్తయిన తరువాతే! ఇక్కడ ఉద్యోగ వర్గాలు పార్టీలకు కొమ్ముకాస్తే నష్టపోయేదివారే!అనేక సందర్భాలలో ఇది రుజువైంది. చరిత్రసాక్షిగా ఇది సత్యమని కూడా తేలింది. ఇప్పు డు ఉద్యోగుల, ఉపాధ్యాయుల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. ప్రస్తుతం ప్రభుత్వశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, ప్రభుత్వ పాఠశాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మునుపెన్నడూలేని విధంగా అనేక వృత్తి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ ఏకరువు పెట్టి ప్రయోజనం లేదు. రోకట్లో తలపెట్టిన తర్వాత రోలు నెత్తిన పడిందని ఏడ్చినా ఉపయోగం లేదు. బ్యూరోస్రి, రెడ్‌ టేపిజం, ఆశ్రిత పక్షపాతం అందెల సవ్వడి చేసినంత కాలం వీళ్లకి వినిపించేది శ్రావ్యమైన రవళికాదు. విషాదనాదాలే! గొర్రెతోక బెత్తెడే అన్నట్లు వీరి పరిస్థితి రిటైర్‌ అయ్యేంతవరకు మారదు. జీవితాల్లో ఎదుగుదల ఉండదు. కుటుంబం వృద్దిచెందు. అప్పుల ఊబి నుంచి బయటపడే పరిస్థితి ఉండదు. అందరి విషయంలో ఇది వాస్తవం కాకపోయినా కొందరి విషయంలోనైనా నిజం కాకుండాపోదు. ఇప్పు డు ఉద్యోగవర్గాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పదవీవిరమణ పొందిన పిదప ప్రభుత్వం నుంచి వచ్చే మొత్తం గురించి. గతంలో మౌనంగా ఉన్న కొత్తగా ఉద్యోగాల్లో చేరిన ఉపాధ్యాయులు ఇప్పుడు రిటైర్‌ అయిన తరువాత ఆర్థికంగా ఎంతనష్టపోతున్నామో అని లెక్కలు వేసుకొని మరీ బాధపడుతున్నారు. వీరిని ఆందోళనా పధంలోకి నెట్టిన విషవృక్షం కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం. సంక్షిప్తంగా సిపిఎస్‌ అంటుంటాం.

ప్రపంచ బ్యాంకు పెత్తనం 1991వ సంవత్సరంనుంచి ప్రయివేటీకరణ, ప్రపంచీకరణ విధా నాలు దేశంలోకి ప్రవేశించినప్పటినుంచి ఆర్థికవ్యవస్థలో పెనుమా ర్పులు జరిగాయి.ప్రపంచబ్యాంకు భారత ఆర్థికవిధానాలపై పెత్తనం సాగించడం మొదలుపెట్టినప్పటి నుంచి పాలకులు తమ పాలనను వారికి ఫణంగా పెట్టారు. కొత్తలో అర్థంకాకపోయినా సంవత్సరాలు గడిచేకొద్దీ ఉద్యోగాలపై దీని ప్రభావం ఇతర రంగాలకంటే ఎక్కు వగా ప్రభావితం అయింది. ప్రయివేటు, కార్పొరేట్‌ శక్తులు ప్రవేశిం చిన తరువాత ఉద్యోగాల్లో కోతపడింది. నియామకాలు నిలిచిపో యాయి. వేతనాలు పెంచమని ఉద్యోగవర్గాలు కోరినా ప్రయోజనా లు శూన్యం. రాయితీల్లో కోతలు పెరిగాయి. ఎన్నివేతన సంఘాలు వేసినా ప్రపంచబ్యాంకు ఆదేశాల మేరకే వేతనాల్లో పెంపు ఉంటుంది. ఎన్ని పోరాటాలు చేసినా ముందస్తు ప్రణాళికల మాదిరిగానే పెంపు ఉంటున్నదే తప్ప పిఆర్‌సిలో ఉదహరించిన ఏవీ అమలు కావు. ముందు ప్రస్తావించినట్లు కొందరు ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ ఉద్యమాన్ని నీరుకార్చ డమో, అణచివేయడమో చేస్తుంటారు. వీరికి మొత్తం ఉద్యోగవర్గాల ప్రయోజనాలకన్నా పాలకుల ప్రయోజనాలే ముఖ్యంగా భావిస్తారు. ఎన్నికల్లో ఆ పార్టీ ఓడి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తే మళ్లీ కొత్త ముఖాలు రంగంలోకి వస్తాయి. భూమి గుండ్రంగా ఉంద న్నట్లు మళ్లీ అదే సంగతులు పునరావృతమవుతుంటాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతున్నది కూడా ఇదే.

పాత పెన్షన్‌ విధానం రద్దు ప్రపంచబ్యాంకు ఆధీనంలో నడుస్తున్న ప్రభుత్వాలు ఉద్యోగ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో నుంచి వచ్చిందే సిపిఎస్‌ విధానం.1980 సంవత్సరానికి ముందు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అందరికీ సరైన వేతనాలు ఉండేవికావు. పదవీవిరమణ తరువాత వారికి ఆర్థికంగా ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధికూడా పెద్దగా ఉండేదికాదు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇతర రంగాల్లో పనిచేస్తున్న వారు పెద్దఎత్తన చేసిన పోరాటాల ఫలితంగా ప్రభుత్వ ఉత్తర్వులు నెం.88, ఆర్థిక, ప్లానింగ్‌ శాఖ తేదీ 26.3.1980 విడు దలైంది. ఈ ఉత్తర్వుల ప్రకారం పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగు లందరికీ రిటైర్మెంటు గ్రాట్యుటీ, పింఛను, కమ్యూటేషన్‌ల పేరుతో కొంత మొత్తం డబ్బు అందేది. అలాగే ఉద్యోగి మరణిస్తే అర్హతను బట్టి ఆ కుటుంబంలో ఒకరికి ఫ్యామిలీ పింఛను అందేది. మర ణించే వరకు ఈ పింఛను మొత్తంతో బతుకుబండిని నెట్టుకుంటూ పోయేవారు.ఈవిధానంవల్ల ప్రభుత్వాలకు వేలకోట్లు నష్టం వస్తున్న దని, పదవీవిరమణ తర్వాత కూడా వీరికి ప్రభుత్వం డబ్బు చెల్లించ డమేమిటని ఆలోచన పుట్టింది. ఈ పింఛను విధానాన్ని రద్దు చేసి దాని స్థానే కొత్త విధానాన్ని అమలులోకి తెస్తే ఎలా ఉంటుందని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాయి. ఆ ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిందే సి.పి.ఎస్‌ విధానం. అందరికీ నష్టాన్ని కల్గిస్తున్న ఈ విధానాన్ని ఇప్పుడు రద్దుచేయమని కోరుతున్నారు.
సిపిఎస్‌ విధానం అమలు సిపిఎస్‌ పథకం 2001-02 కేంద్ర బడ్జెట్‌లో జాతీయ పెన్షన్‌ పథకం ఎన్‌పిఎస్‌ పేరుతో భారత ప్రభుత్వం చేపట్టిన పెన్షన్‌ సంస్కరణల్లో భాగంగా వచ్చింది. ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన హామీ మేరకు నాటిపాలకులు పెన్షన్‌ రద్దుకు నడుం బిగించారు. అందులో భాగంగా పిఎఫ్‌ఆర్‌డిఎ బిల్లుమొదటిసారిగా ఎన్‌డిఎ ప్రభుత్వం పార్లమెంట్‌ ముందుకుతెచ్చింది.ఆ తరువాత 2005లో యుపిఎ-1 ప్రభుత్వం చొరవతో పార్లమెంట్‌లోని వామపక్షాలు తప్ప మిగిలిన అన్ని పార్టీలు పూర్తి మద్దతు ప్రకటించాయి. 2004 జనవరి ఒకటి నుంచి కేంద్రప్రభుత్వ శాఖలో చేరిన ఉద్యోగులకు జాతీయ పెన్షన్‌ పథకం అమలులోకి వచ్చింది. నాటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 2004 సెప్టెంబర్‌ ఒకటి నుంచి ఈ జాతీయ పెన్షన్‌ విధానం సిపిఎస్‌ పేరుతో అమలులోకి వచ్చిం ది.ప్రభుత్వ ఉత్తర్వులు 653తేదీ 22.09.2004 ప్రకారం 2004 సెప్టెంబర్‌ ఒకటి నుంచి సర్వీస్‌లో చేరిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యో గులు, స్థానిక సంస్థల ఉద్యోగులు, విశ్వవిద్యాలయ ఉద్యోగులు, గ్రాంట్‌- ఇన్‌-ఎయిడ్‌ పొందుతున్న సంస్థలోని ఉద్యోగులు, అటా మనస్‌ పరిధిలోని ఉద్యోగులందరికీ ఈ పథకాన్ని వర్తింపచేశారు. స్థూలంగా చెప్పాలంటే 2004 సెప్టెంబర్‌ ముందు సర్వీసులో ఉన్న వారికి పాతపెన్షన్‌ విధానం కొనసాగుతుంది. ఆ తరువాత నియామకం పొందిన వారందరికీ సిపిఎస్‌ విధానం వర్తిస్తుంది. అంటే ముందుగా పేర్కొన్నవారికి రిటైర్‌ అయిన తరువాత నెలనెలా పింఛను వస్తుంది. ఆ తరువాత సర్వీసులో చేరిన వారికి మాత్రం సిపిఎస్‌ కింద పెద్దమొత్తంలో డబ్బు అందుతుందిగాని నెలవారీ పింఛను అందదు.
సిపిఎస్‌ విధానం వల్ల నష్టం సిపిఎస్‌ పథకంలో చేరినవారంతా ప్రతినెలా తమ మూలవేతనం లో, కరువు భత్యంలో 10శాతం సిపిఎస్‌ చందాగా చెల్లించాలి. దీనికి మ్యాచింగ్‌ గ్రాంటుగా అంతేమొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగి ఖాతా కు జమచేస్తుంది. చందాదారులుగా చేరిన ప్రతి వ్యక్తికి పర్మినెంట్‌ రిటైర్మెంట్‌ అకౌంట్‌ నెంబరు జారీ చేయబడుతుంది. పథకానికి సంబంధించిన రికార్డుల నిర్వహణ నేషనల్‌ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌డిఎల్‌) చేబడుతున్నది. వీరు జమచేస్తున్న మొత్తాన్ని ఉద్యోగి పదవీ విరమణ చేసినప్పుడు నెలవారీ పింఛను పొందడానికి కనీసం 40 శాతం పెన్షన్‌ ఫండ్‌ జమలుయాన్యూటి బాండ్స్‌ కొనుగోలుకు వినియోగించాల్సి ఉంటుంది. మిగిలిన 60 శాతం జమలు పూర్తి మొత్తంగా చెల్లిస్తారు. లేదా చందాదారుడు ఎంపిక చేసుకున్న వివిధచెల్లింపు పథకాల ద్వారా చెల్లిస్తారు. దీనికై పిఎఫ్‌ఆర్‌డిఏ నిర్దేశించిన ఏడు సంస్థలల్లో ఒక దానిని ఎంపిక చేసు కోవాలి.ఉద్యోగుల డబ్బుతో వీరు షేర్‌ మార్కెట్‌ వ్యాపారం చేస్తారు. లాభాలువస్తే వాటాయిస్తారు. నష్టాలు వస్తే జమలు మొత్తం చెల్లించరు. అంటే ఉద్యోగులు తమకు తెలియకుండానే పరోక్షంగా షేర్‌ బిజినెస్‌ చేస్తున్నారు.దీనివల్ల ఉద్యోగంలో చేరిన ఉద్యోగి 30 సంవత్సరాల తరువాత పదవీవిరమణ చేస్తాడనుకుంటే అతనికి గతంలో కొనసాగిన పెన్షన్‌ కంటే తక్కువ స్తుంది.నిజం చెప్పాలంటే కొన్ని లక్షలు నష్టపోతారు. అనగా అప్పటి మార్కెట్‌ విలువకు వీరు పొందిన మొత్తం తక్కువగా ఉంటుంది.

ఉదాహరణకు ఒక ఉద్యోగి 2008లో ఉద్యోగంలో చేరితే 30 సంవత్సరాల తరువాత వివిధ కాలాల్లో వేతన సవరణల ద్వారా నెలకు వేతనం రూ.22 లక్షల యాభైవేలు అనుకుంటే ఇందులో 60 శాతం అనగా రూ. 13లక్షలు చేతికి వస్తే 40 శాతం అనగా ఎనిమిది లక్షల రూపాయలకు వడ్డీ ఫించనుగాయిస్తారు. అంటే అప్పటికి అతనికి నెలవారీ పింఛను ఏడు నుంచి ఎనిమిదివేల వరకు మాత్రమే. అతి కూడా అప్పటికి అతనికి ఒడిదుడుకులను బట్టి.అదే 2004 నాటిముందు ఉద్యోగులకయితే పింఛను రూల్సు ప్రకారం వారికి 30 సంవత్సరాల తరువాత నెలవారి పింఛను లక్ష నుంచి రెండు లక్షల వరకు పొందుతారు. ఈ వ్యత్యాసాన్ని గమనించే ఇప్పుడు ఉద్యోగులు సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని తిరిగి కొనసాగించాలని ఆందోళన చేస్తున్నారు. పర్యవసానం కాలమే నిర్ణయించాలి.
సిపిఎస్‌ సమస్యలు సిపిఎస్‌ ఖాతాదారులు తమ అకౌంట్స్‌కు సంబంధించిన పాన్‌ కార్డు, సకాలంలో రాకపోవడం, ఐ-పిన్‌, టి-పిన్‌లను తిరిగి పొంద డం ఖాతాదారుల వివరాలను మార్పు చేయడం, వీరి వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయకపోవడం, ట్రాన్సాక్షన్‌ స్టేట్‌మెంట్‌ లేకపోవడం, ప్రభుత్వం ప్రతినెలా మ్యాచింగ్‌ గ్రాంట్‌ను ఉద్యోగి ఖాతాలో జమచేయకపోవడం, షేర్‌మార్కెట్‌ ఒడిదుడుకుల వల్ల ఖాతాదారుడు నష్టపోవడం,పదవీవిరమణ అనంతరం వచ్చే మొత్తం అవసరాలకు సరిపడకపోవడం, 2034 తరువాత మార్కెట్‌ పరిస్థితి ఊహించడానికే భయంకరంగా ఉండటం, ఫ్యామిలీ పెన్షన్‌ సౌకర్యంలేకపోవడం వంటి కారణాల వల్ల ఉద్యోగులు ఈ పథకన్ని రద్దు చేయాలని కోరుతున్నారు.